రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పీఆర్సీలు అమలు చేయకపోవటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి అన్నారు. అనంతపురం పర్యనటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 25 నెలలుగా పీఆర్సీ అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. 2018 సంవత్సరం జూలై నుంచి ఇవ్వాల్సిన 11 పీఆర్సీని అమలు చేయకపోగా... మళ్లీ ఉన్నతస్థాయి కమిటీ వేస్తామంటూ ప్రకటన చేయటం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే మూడు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి..: ఏపీఎన్జీవో - ఏపీలో మూడు రాజధానుల వార్తలు
ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో జాప్యం చేయడం సరికాదన్నారు. 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
apngo president chandrasekhar reddy