అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హాజరయ్యారు. కొవిడ్-19 నివారణ చర్యలు పాటిస్తూ... పార్టీ కార్యకలాపాల్లో అనుసరించాల్సిన విషయాలను ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలు, నాయకులకు శైలజానాథ్ సూచించారు.
'రాష్ట్రంలో సారా దొరుకుతుంది గానీ ఇసుక దొరకదు' - వైసీపీపై ఏపీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్ కామెంట్స్
రాష్ట్రంలో మద్యం దొరికినంత ఈజీగా ఏ వస్తువు దొరకడంలేదని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా కొడిగెనహళ్లిలో కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన... కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో మద్యం దొరికినంత వీజీగా ఏ వస్తువు దొరకడం లేదని ఆరోపించారు. వైకాపా పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. డా.సుధాకర్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి ప్రజలందరూ గమనించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికీ సుధాకర్ పరిస్థితి తీసుకువస్తారని శైలజానాథ్ అన్నారు.
ఇదీ చదవండి :విజయవాడలో ఎద్దుల వీరంగం..మట్టి కుండలు ధ్వంసం