సీఎం జగన్.. చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండదని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా అనంతపురంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన శైలజనాథ్.. తమ పార్టీ ఎంపీలను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జగన్ ప్రస్తుతం ఆ హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఎంపీల మద్దతు లభించేలా తాను చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో ఆస్తుల విలువ ఆధారిత పన్ను అమలు చేస్తే పేద, మధ్యతరగతి ప్రజలు ఆస్తులు అమ్ముకోవల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.
shailajanath: ఆస్తి విలువ ఆధారిత పన్ను అమలుచేస్తే.. ప్రజలు ఆస్తులు అమ్ముకోవలసిందే' - ananthapuram latest news
సీఎం జగన్ వైఖరిపై ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న హామీని విస్మరించారని అన్నారు. ఆస్తివిలువ ఆధారిత పన్ను అమలు చేస్తే.. ప్రజలు ఆస్తులు అమ్ముకోవలసిందేనని ఆవేదన చెందారు.
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్