ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చెత్తపై పన్నులు వేస్తున్నారు.. చెత్త పరిపాలన చేస్తున్నారు' - కాంగ్రెస్ తాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద పన్నులు వేస్తూ.. చెత్త పాలన సాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ప్రజలను వంచించే విధంగా వైకాపా పాలన సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం కేంద్ర జలవనరుల శాఖను నిలదీయాలని సూచించారు.

apcc president sailajanath
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

By

Published : Jul 4, 2021, 5:12 PM IST

రాష్ట్రంలో ప్రజలను వంచించే విధంగా వైకాపా పాలన సాగుతోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే.. చెత్త మీద పన్నులు వేస్తూ.. చెత్త పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనపై ప్రజలు ప్రశ్నిస్తారనే ఆలోచనతోనే.. జల జగడం పెట్టుకున్నారని మండిపడ్డారు.

రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం కేంద్ర జలవనరుల శాఖను నిలదీయాలని శైలజానాథ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి.. రాయలసీమకు నీళ్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమంపై.. ముఖ్యమంత్రి దృష్టిసారించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details