ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్పొరేట్ కంపెనీలు దోచుకునేందుకే నూతన వ్యవసాయ చట్టాలు' - నూతన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ కామెంట్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనంతపురంలో రైతులతో కలిసి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.

'కార్పొరేట్ కంపెనీలు దోచుకునేందుకే నూతన వ్యవసాయ చట్టాలు'
'కార్పొరేట్ కంపెనీలు దోచుకునేందుకే నూతన వ్యవసాయ చట్టాలు'

By

Published : Nov 10, 2020, 3:12 PM IST

కార్పొరేట్ కంపెనీలు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దోచుకునేందుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు చేసిందని శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించే ఆలోచన విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా రైతులకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ అన్నదాతల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని శైలజానాథ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రజలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ట్రాక్టర్ల ర్యాలీ అనంతపురంలోని బళ్లారి రోడ్ నుంచి ప్రారంభమై.. కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేత ఉమెన్ చాందీ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details