ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరీక్షల నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి... కరోనా కట్టడి మీద లేదు' - ప్రభుత్వం విఫలమైందన్న శైలజానాథ్

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై.. అనంతపురంలో ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పరీక్షల నిర్వహణ, మద్యం దుకాణాలపై ఉన్న ఆసక్తి.. మహమ్మారి వ్యాప్తి నిరోధించడంలో చూపించాలని హితవు పలికారు.

sailajanath allegations on government
ప్రభుత్వంపై శైలజానాథ్ విమర్శలు

By

Published : May 5, 2021, 7:46 PM IST

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌ ఆరోపించారు. కొవిడ్ కట్టడి కోసం ఒక్కో జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు కర్ఫ్యూతోపాటు లాక్‌డౌన్‌ సైతం విధించాలని డిమాండ్ చేశారు. సంక్షోభం కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోతుండగా.. వారికి నెలకు రూ.7,500 ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా నిత్యవసర సరకులు పంపిణీ చేయాలన్నారు.

ఇదీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్రాల ఆంక్షల వ్యూహం

వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల మీద ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి.. కరోనా కట్టడి మీద లేదని విమర్శించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో.. ఉదయం 6 గంటల నుంచే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించడం దారుణమన్నారు.

ఇదీ చదవండి:

ప్రజల ప్రాణాల కంటే ప్రభుత్వానికి ఎక్కువేంటి?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details