ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సహాయంలో చెయ్యందిస్తారు - ఆపదొస్తే ఆప్తబాంధవులు

Apathbandu Trust In anantapur District : ఎవరైనా సరే ఆపదలో ఉన్నామంటే చాలు వెంటనే స్పందిస్తారు. అనారోగ్యం బారినపడి వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉన్నట్లు తెలిస్తే వారికి తమవంతు సాయమందిస్తారు. సొంత నిధులతో పాటు విరాళాలు సేకరించి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న బాధితులకు సాయపడతారు. ఆపన్నులకు అండగా నిలుస్తూ ఆప్తులుగా సేవలందిసున్న అనంతపురం యువకుల సందేశాత్మక కథనం ఇది.

apathbandu_trust_in_anantapur_district
apathbandu_trust_in_anantapur_district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 4:36 PM IST

Apathbandu Trust In anantapur District :ఎక్కడ ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోటానికి కేవలం ఫోన్ కాల్ దూరంలో ఉంటారు ఈ యువకులు. చిన్న వయసులోనే పెద్ద మనసుతో సేవలందిస్తున్న వీరందరిది ఒక్కో నేపథ్యం. అయినా సరే సవాళ్లను ఎదురించి ఒక్కదాటిపై వెళ్తున్నారు. అయితే వీళ్లందిరిదీ ఒకే లక్ష్యం. ఇబ్బంది పడేవారికి సహాయపడటం. తద్వారా వారి ఆనందాన్ని వీరి సంతోషంగా భావించడం. అనంతపురం జిల్లా ఉరవకొండకి చెందిన ఈ యువకుడి పేరు మురళి. ఇతనికి పాఠశాల రోజుల నుంచి సేవభావం ఎక్కువ. తనతోపాటే ఆ సేవాగుణం పెరుగుతూ వచ్చింది. ఓ రోజు అనుకోకుండా గర్భవతికి రక్తదానం చేయాల్సివచ్చింది. చేసిన రక్తదానం అతని ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసింది. రక్తదానం చేయడం వల్ల వచ్చిన ఆత్మసంతృప్తి ఇంతకు ముందెప్పుడు తనకు కలగలేదని తాను ఏదైనా వినూత్నంగా చేయాలని ఆ రోజే భావించాడు మురళి.

సహాయంలో చెయ్యందిస్తారు - ఆపదొస్తే ఆప్తబాంధవులు

వైద్యుల పిలుపుతో రక్తదానానికి యువత ముందడుగు

Youth Started Trust :పెయింటర్‌గా పనిచేస్తూనే రక్తదానాన్ని ఓ ఉద్యమంగా మార్చాడు మురళి. తనలాంటి మనసత్వం, సేవగుణం ఉన్న వారందరిని ఒక్కదాటిపైకి తీసుకొచ్చాడు. అయితే ఈ యువకులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ఒక్కోరిది ఓ నేపథ్యం. కొందరు పెయింటర్లు కాగా, మరికొందరు చదవుకుంటున్న విద్యార్థులు. అయితే వీళ్లందరిదీ ఒకటే ఆలోచన పేదలకు సహాయపడాలి, నిత్యం సేవాభావంతో పనిచేయాలనేది. సేవచేయాలనే సదుద్దేశ్యంతో ఈ యువకులంతా ఆపద్బంధు ట్రస్టు ఏర్పాటు చేశారు. తొలుత రక్తదానం చేయటం ఆరభించి, అనంతరం యాచకులు, మతిస్థిమితం లేనివారిని ఆదుకోవం వంటి వాటితో తమ సేవలను విస్తరించారు. ఈ ట్రస్టు ద్వారా ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు మురళి, అతని స్నేహితుల బృందం.

16వ ఏట నుంచే రక్తదానం- 'బ్రావో' రికార్డ్స్​లో చోటు

Poor Sudents Managing Trust : కరోనా సమయంలో మృతి చెందిన వారి అంత్యక్రియలకు అప్పట్లో ప్రభుత్వం, స్థానిక సంస్థలు కూడా సాధ్యంకాక చేతులెత్తేశాయి. కానీ ఈ యువకులంతా ప్రాణాలను లెక్కచేయకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనాతో మృతి చెందిన చాలా మందికి సొంత ఖర్చుతో అంత్యక్రియలు నిర్వహించారు. కూలీకి వెళ్లలేక పస్తులుండే ఎన్నో కుటుంబాలకు నిత్యావసరాలు అందించి, ఆకలి తీర్చారు. మనషులవి మాత్రమే కాదు మూగజీవుల బాధలనూ అర్థం చేసుకున్నారు ఈ స్నేహితులు. ఉరవకొండ వీధుల్లో ఉండే శునకాలు, ఆవులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలా వారికి దృష్టికి వచ్చిన ప్రతి జీవిని ఆకలి బాధనుంచి తప్పించి కాపాడుతున్నారు. అత్యవసర పరిస్థితిలో చేతనైనంతగా సేవలందించి అధికారులకు సహాయకులుగా వ్యవహరిస్తునారు. ఆపద్బంధు ట్రస్టు సేవలను గుర్తించిన ఉరవకొండ పంచాయతీ అధికారులు 30 లక్షల రూపాయలు విలువచేసే స్థలాన్ని ట్రస్టుకు కేటాయించారు.

శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

చిన్నపాటి పనులు చేసుకుంటూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని తమకంటే అభాగ్యులైన వారికోసం ఖర్చుచేస్తున్నారీ యువకులు. పెద్ద మనసుతో సేవచేస్తూ అందరి నుంచి మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నారు.అయితే ఆపద్బంధు ట్రస్టు స్వంత భవనం నిర్మించుకుని మరికొంతమందిని ఆదుకోవాలంటే ఆర్థికంగా దాతలెవరైనా చేయి కలపాలని కోరుకుంటున్నారు ఈ ట్రస్టు సభ్యులు.

ABOUT THE AUTHOR

...view details