ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేనేతలకు రూ.24 వేలు ఆర్థిక సాయం - వైఎస్​ఆర్ నేతన్న నేస్తం పథకం

మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24 వేలు అందించే నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో కొందరు నేతన్న కుటుంబాలకు సీఎం చెక్కులను అందజేశారు. ఆప్కోను ప్రక్షాళన చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని ప్రకటించారు. పేద వర్గాలకు మేలు చేస్తూ నవరత్నాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

ap-ysr-nethanna-nestham-scheme
ap-ysr-nethanna-nestham-scheme

By

Published : Dec 21, 2019, 2:34 PM IST

చేనేతలకు 24వేల రూపాయల ఆర్థికసాయం

చేనేతలు పేదరికం,అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం జగన్ అన్నారు.ఆప్కో వ్యవస్థను ప్రక్షాళన చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అనంతపురం జిల్లా ధర్మవరంలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా24వేలు అందించే నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా85వేలమందికి రూ.24వేలు చొప్పున అందజేస్తామని తెలిపారు.పాత అప్పులకు ఈ నగదు జమ చేయవద్దని బ్యాంకర్లకు సూచించారు.పేద వర్గాలకు మేలు చేస్తూ నవరత్నాలను అమలు చేస్తున్నామన్న సీఎం...జనవరి9న అమ్మఒడి పథకాన్ని తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన6నెలల్లోనే4లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని సీఎం జగన్ పేర్కొన్నారు.లక్షా30వేలమందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామన్నారు.సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలని తెలిపారు.కులాలు,మతాలు,ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అందరికీ న్యాయం చేస్తున్నామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details