- గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుని వ్యక్తి మృతి..
గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, జరిగిన తతంగం వింటే.. మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు. తెలంగాణ జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై.. పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏం తేలుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అవినీతికి పాల్పడిన అకౌంటెంట్ సస్పెండ్..
అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ అకౌంటెంట్ సిరిల్ పాల్‌ను కమిషనర్ చేకూరి కీర్తి సస్పెండ్ చేశారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులను తెలివిగా అకౌంటెంట్ సిరిల్ పాల్ తన సొంత ఖాతాల్లోకి మళ్ళించుకుని.. మొత్తం రూ.47 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. బిల్లులు అందని గుత్తేదారు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పేదల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి కాంట్రాక్టు ఇస్తాం.. అజేయ్ జైన్
పేదలందరికీ ఇళ్లు పథకంలో బాగంగా ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కర్నూలులో అన్నారు. ఈ పథకానికి 35వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని సీఎం కోరారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కందుకూరి వీరేశలింగం.. హితకారిణి సమాజం భూములపైన సర్కారు కన్ను!
సమాజహితం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన త్యాగధనుల ఆస్తులపైనా వైకాపా సర్కార్ కన్నుపడింది. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం యావదాస్తి ధారపోసి స్థాపించిన హితకారిణి సమాజం భూముల స్వాధీనానికి పావులు కదపుతోంది. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనం పేరిట రాజమహేంద్రవరంలోని 200 కోట్ల విలువైన హితకారిణి సమాజం భూములను లాగేసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ
గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈశుదాన్ గఢ్వీ ఎంపికయ్యారు. ఈ మేరకు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇళ్ల మధ్యలోకి వచ్చి బీభత్సం సృష్టించిన చిరుత