- సీఎం జగన్ సభాస్థలి వద్ద అపశ్రుతి.. వృద్ధురాలికి తీవ్రగాయాలు
OLD WOMAN SERIOUSLY INJURED : సీఎం జగన్ సభాస్థలి వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. సభ కోసం వచ్చి బస్సు దిగే క్రమంలో ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పింఛన్ల పెంపు వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో సీఎం బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
- మింగ మెతుకు లేదు కానీ.. రూ. 15.77 కోట్లతో 19 వాహనాల కొనుగోలు..
NEW TOYOTA FORTUNER VEHICLES : అసలే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఆచితూచి అడుగేయాల్సిన సమయంలో వృథా ప్రయాసలకు పోయి అధిక మొత్తంలో వెచ్చిస్తున్నారు. తాజాగా పోలీసులు కొత్తగా 19 టయోటా ఫార్చ్యూనర్ వాహనాలను కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ వాహనాలకు రూ.15.77 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో తాజాగా భారీ మొత్తం వెచ్చించి కొత్త వాహనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
- ముఖ ఆధారిత హాజరు యాప్.. ఆదిలోనే సాంకేతిక సమస్య
Ap Face App Problems : ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ఇబ్బందుల మధ్యే హాజరు నమోదు చేశారు. రాష్ట్ర సచివాలయం సహా జిల్లాల్లోని కలెక్టరేట్లు, ఇతర జిల్లాల కార్యాలయాలకు ఉదయం 10గంటల సమయానికే చేరుకున్న ఉద్యోగులు యాప్ డౌన్లోడ్ చేసుకుని హాజరు వేసేందుకు ప్రయత్నించినా సాంకేతిక ఇబ్బందుల కారణంగా నమోదు కాలేదు.
- ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ విడుదల
Vuyyuru Foundation Head Released: గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్‌ను విడుదల చేస్తూ.. ఐదో అదనపు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. 25 వేల రూపాయల స్వయం పూచికత్తుపై విడుదల చేశారు. విచారణకు సహకరించాలని సూచించారు
- నెల్లూరులో ఫ్లెక్సీల ఏర్పాటు.. ఒకే కుటుంబంలోని రెండు వర్గాల మధ్య వివాదం
Conflicts Between Ycp Leaders: వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. సంక్రాంతి ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది.
- పంజాబ్ సరిహద్దులో పాక్ చొరబాటుదారుడు హతం
పంజాబ్‌లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు గుండా.. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడిని భద్రతా దళాలు హతమార్చాయి.
- ఎత్తైన యుద్ధక్షేత్రంలో దేశానికి రక్షణగా 'వీరనారి'.. తొలి మహిళగా రికార్డ్
సియాచిన్‌లో పోస్టింగ్ సాధించిన తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ రికార్డుకెక్కారు. సియాచిన్లోని కుమార్ పోస్టులో ఈ వీరనారి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఫొటోలు విడుదల చేసింది.
- పెరిగిన డిపాజిట్ రేట్లు.. పొదుపు పథకాల్లో ఏది బెటర్?
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ రెపోరేటును పెంచింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను సైతం పెంచాయి. మరి చిన్న పొదుపు పథకాల్లో ఏవి మంచి రాబడినిస్తున్నాయో చూద్దాం..!
- 'ప్రయోగాలకు సమయం లేదు!'.. శ్రీలంక సిరీస్‌పై కొత్త కెప్టెన్ కామెంట్స్
ఆసియా కప్ సందర్భంగా శ్రీలంక చేతిలో ఓడిన భారత్ మరోసారి ఆ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య ఈ సిరీస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
- మరో 'అన్‌స్టాపబుల్' ట్విస్ట్.. పవన్ ఎపిసోడ్ ఇప్పుడే కాదంట.. సంక్రాంతికి స్పెషల్ ప్లాన్..!
అన్‌స్టాపబుల్ దూసుకెళ్తున్న్ ఎన్బీకే షోలో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారన్న వార్త తెలియగానే ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత మోస్ట్ అవెయిటింగ్ ఎపిసోడ్‌గా పవన్ ఎపిసోడ్ నిలుస్తున్న సమయంలో ఆహా సంస్థ ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ న్యూస్ ఇచ్చింది. అదేందంటే.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు