- MURMU : శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
PRESIDENT MURMU AT SRISAILAM : శ్రీశైల మల్లన్నను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దేవస్థాన అర్చకులు ముర్ముకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
- వంగవీటి మోహనరంగా 34వ వర్ధంతి.. నివాళులు అర్పించిన పలువురు నాయకులు
VANGAVEETI RANGA: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా సేవలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వ్యాఖ్యానించారు.
- పాత పింఛన్ ఒక్కటీ తీసేయడానికి వీల్లేదు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
MLA KOTAMREDDY SRIDHAR REDDY ON PENSIONS : సామాజిక పింఛన్ల తొలగింపుపై.. తనకు బాధితుల నుంచి ఫోన్లు వస్తున్నాయని నెల్లూరు గ్రామీణ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. పాత పింఛన్లు తొలగిస్తే ఊరుకోబోనంటున్న కోటంరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
- మీరు ఆర్సీ, డీఎల్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇక ఆ విషయం మర్చిపోండి!
DRIVING LICENCE SMART CARDS : మీరు ఏదైనా కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కోసం ఎదురుచూస్తున్నారా? డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) పరీక్షలో అర్హత సాధించి డీఎల్ కార్డు ఎప్పుడొస్తుందా అని వేచిచూస్తున్నారా? అయితే వాటి గురించి మరచిపోవాల్సిందే.
- నలుగురు విదేశీయులకు కరోనా.. అందరూ ఆ ప్రోగ్రామ్‌కు వచ్చినవారే!
బిహార్‌కు చేరుకున్న నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యశాఖ అప్రమత్తమై.. అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
- భారత్ 'రాకెట్ ఫోర్స్'కు రంగం సిద్ధం.. డ్రాగన్‌కు ఇక చుక్కలే!
చైనాకు దీటుగా భారత్ కూడా రాకెట్ ఫోర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా 120 ప్రళయ్ క్షిపణుల కొనుగోలు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రాకెట్ ఫోర్సును ఏర్పాటు చేసే దిశగానే ఈ అడుగులు పడుతున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
- తైవాన్‌పై చైనా దూకుడు.. 71 యుద్ధ విమానాలను పంపిన డ్రాగన్
తైవాన్‌కు అమెరికా మద్దతుగా నిలిస్తున్నందున చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా తమ గగన తలంలోకి 71 యుద్ధ విమానాలను పంపిందని తైవాన్ ఆరోపించింది.
- ICICI బ్యాంక్ కేసులో వీడియోకాన్ ఛైర్మన్ అరెస్ట్
ఐసీఐసీఐ బ్యాంక్ రుణ మోసం కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ దూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
- జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్
భారత బాక్సింగ్ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 2022వ ఏడాదిని ఘనంగా ముగించి.. మరోసారి తానేంటో నిరూపించింది. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఈమె.. జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరో ముందడుగు వేసి అదరగొట్టింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరిగిన ఫైనల్లో అద్భుత విజయం సాధించింది మరో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
- అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్ ఎందుకున్నాడబ్బా.. లింక్ ఏంది?
టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ కుటుంబాలతో కలిసి క్రిస్మస్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే హీరో అడివి శేష్ మాత్రం.. అక్కినేని ఫ్యామిలీతో కలిసి చేసుకున్నాడు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు మెదులుతున్నాయి.
ఏపీ ప్రధాన వార్తలు
Last Updated : Dec 26, 2022, 3:08 PM IST