ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Dec 15, 2022, 7:02 PM IST

  • అంగన్‌వాడీ పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్‌ కిట్‌ నాణ్యతలో రాజీ వద్దు: సీఎం జగన్​
    CM JAGAN ON : అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేసిన సీఎం.. సకాలంలో నాడు-నేడు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి: చంద్రబాబు
    CBN LETTER TO CS: మాండౌస్‌ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. వరి, అపరాలు, అరటి, బొప్పాయి, పొగాకు, శనగ, మిరప, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మడకశిర వైసీపీలో విభేదాలు.. మంత్రి ముందే ఎమ్మెల్యేపై ఆరోపణలు
    MLA Thippeswamy: మడకశిర వైకాపాలో అసంతృప్తి చల్లారలేదు. నియోజకవర్గంలో పార్టీ సమీక్షకు హాజరైన మంత్రి పెద్దిరెడ్డికి స్వాగతం పలికిన నాయకులు.. ఆయన ముందే ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "తిప్పేస్వామి వద్దు - జగనన్న ముద్దు" అంటూ నినాదాలతో హోరెత్తించారు. వాళ్లకు నచ్చజెప్పేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సహకార డెయిరీల ఆస్తులు కబ్జా చేసేందుకే.. జగన్​ 'అమూల్​ బేబీ' అవతారం: పట్టాభి
    PATTABHI FIRES ON CM JAGAN : రాష్ట్రంలో సహకార డెయిరీల ఆస్తులు కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్​ అమూల బేబీ అవతారం ఎత్తాడని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్​ మండిపడ్డారు. చిత్తూరు డెయిరీ ఆస్తులను నామమాత్ర ధరకు అమూల్‌కు కట్టబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వీరులపాడు మండల కేంద్రాన్ని తరలిస్తే.. ఊరుకోం: గ్రామస్థులు
    Veerulupadu Villagers Protest Event : ఎన్టీఆర్‌ జిల్లాలోని వీరులపాడు మండలకేంద్రాన్ని తరలించవద్దని గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా తహసీల్దార్ కార్యలయం వద్ద నిరసన చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లవర్​ స్కూటీ తగలబెట్టిన యువకుడు.. జైలుకు పంపినందుకే..
    లవర్​ స్కూటీ తగలబెట్టాడు ఓ యువకుడు. తనను జైలుకు పంపిందనే కారణంతోనే ఇలా చేశానని చెప్పాడు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్షుద్రపూజల పేరుతో కన్నకూతురిని చంపిన తల్లి!.. వంటగదిలోనే పూడ్చిపెట్టి..
    క్షుద్రపూజల పేరుతో కన్నకూతుర్ని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టింది ఓ మహిళ. మూడు నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో ఇంట్లో గ్యాస్​లీకై మంటలు వ్యాపించగా.. ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ.. ఆస్పత్రుల వద్ద జనం బారులు!
    చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆస్పత్రుల వెలుపల రోగులు క్యూకడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేఎల్​ రాహుల్​పై దినేశ్​ కార్తిక్ కామెంట్స్​​.. అలా అనేశాడేంటి?
    బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా కేఎల్ రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై దనేశ్ కార్తిక్​ స్పందించాడు. అలా అనడం కరెక్ట్ కాదని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మీకు 'అవతార్​ 2' టికెట్లు దొరకలేదా.. అయితే ఓటీటీలో ఈ మూవీస్​ ట్రై
    ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ వారం మొత్తం బాక్సాఫీస్‌ ముందు భారీ విజువల్​ వండర్​ అవతార్​ 2 సందడే ఉంటుంది. అయితే ఈ భారీ చిత్రం టికెట్లు దొరకపోవచ్చు. అందుకే ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేయండి. వాటిని చూసి ఆస్వాదించండి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details