- తుపాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు
Mandous Cyclone victims in AP: మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తుఫాను బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని,.. రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పాడైపోయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి రైతుల సంక్షేమాన్ని పత్రికా ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం చేశారని అచ్చెన్న దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుపాను బాధితులను ఆదుకోవడంలో.. అధికారుల నిర్లక్ష్యం: సీపీఐ
CPI leaders on Mandous Cyclone: మాండౌస్ తుపాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య మండిపడ్డారు. అధికారులందరూ వారి వారి బంగ్లాలకే పరిమితమయ్యారంటూ కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. గతేడాది అన్నమయ్య ప్రాజెక్టు వరద ప్రవాహములో తెగిపోతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఈశ్వరయ్య ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరివర్తన 2.0.. మారిన కప్పరాల తిప్ప గ్రామం
Villagers have changed: నాటుసారా, దొంగతనాలకు అలవాటుపడ్డ ఆ గ్రామ ప్రజలను పోలీసులు సక్రమ మార్గంలో పెట్టారు. ఉపాధి లేక, ప్రభుత్వాలు సైతం పట్టించుకోని తరుణంలో కుటుంబ పోషణకు అడ్డదారులు తొక్కిన వారిని పోలీసులు మార్చారు. వీరి మార్పుపై శ్రద్ధపెట్టిన పోలీసులు, ఎస్ఈబీ అధికారులు పరివర్తన 2.O పేరుతో రుణ సాయం అందించి బతుకుల్లో మార్పు తెచ్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాణిజ్య భవనంలో పొగలు.. సకాలంలో స్పందించడంతో
Heavy Smoke In Building : విశాఖలోని ఓ వాణిజ్య భవనంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. పోలీసు రక్షక బృందం గమనించి.. ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పొగను అదుపు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బీ అలర్ట్.. రాగల మూడు రోజులు వర్షాలున్నాయ్..!
mandous cyclone effect on Hyderabad: మాండౌస్ తుపాను ప్రభావంతో హైదరాబాద్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి.నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, బషీర్ బాగ్, లక్డీకపూల్, నాంపల్లి, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. పనుల నిమిత్తం బయటకు వెళ్లినవారు వర్షంలో తడుస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుమార్తెకు రైతు ఎకో ఫ్రెండ్లీ వివాహం.. కట్నంగా ఆవు.. సేంద్రియ పదార్థాలతో విందు
గుజరాత్‌కు చెందిన ఓ రైతు.. తన కూతురు పెళ్లిని వినూత్నంగా నిర్వహించాడు. పూర్తి సంప్రదాయబద్ధంగా, పర్యావరణహితంగా పెళ్లిని జరిపించాడు. భావితరాలకు మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పని చేశానని చెపుతున్నాడు ఆ వ్యక్తి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'షార్ట్‌కట్ రాజకీయాలతో దేశాభివృద్ధి జరగదు'
PM Modi Nagpur Visit : దేశంలో 6వ 'వందే భారత్' రైలు పట్టాలెక్కింది. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. అనంతరం నాగ్‌పుర్ తొలిదశ మెట్రోను ప్రారంభించిన మోదీ.. రెండో దశ పనులకు పునాదిరాయి వేశారు. తర్వాత నాగ్‌పుర్ ఎయిమ్స్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. షార్ట్‌కట్ రాజకీయాలతో దేశాభివృద్ధి జరగదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తప్పుడు వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వడ్డీ రేట్ల పెంపుతో హోంలోన్ భారం అవుతోందా? అయితే ఇలా చేయండి!
ఆరేళ్ల క్రితం వరకు గృహరుణాల వడ్డీ రేట్లు 8.65 శాతం నుంచి 9.10 శాతం వరకు ఉండేవి. అక్టోబరు 2019 తర్వాత బ్యాంకులు రెపో ఆధారిత వడ్డీ రేటు విధానానికి మారాయి. అయితే రెపో రేటు మరోసారి పెరగడం వల్ల గృహరుణం మరింత భారం అవుతోంది. ఈ నేపథ్యంలో గృహరుణం భారం కాకుండా ఏం చేయాలో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డియర్ క్రికెట్.. మరొక్క ఛాన్స్ ఇవ్వు.. అభిమానులను కదిలించిన ఆటగాడి ట్వీట్!
టీమ్ఇండియా ప్లేయర్ కరుణ్ నాయర్‌కు సుదీర్ఘకాలం జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడానికి గల కారణాలపై మేనేజ్‌మెంట్ తనకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆవేదన చెందిన ఆయన తాజాగా ట్విట్టర్లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. దీంతో అతడి ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేనే హీరోనంటే.. చాల్లే పొమ్మన్నారు.. కానీ ఆయన మాత్రమే!: 'లవ్‌టుడే' హీరో
యువప్రేక్షకులు.. బావున్న సినిమాలన్నీ చూస్తుంటారుకానీ చాలా కొద్దివాటినే తమ మనసుకి దగ్గరగా భావిస్తుంటారు. ప్రతి ఫ్రేములోనూ తమని తాము చూసుకుంటుంటారు. ఈ మధ్య వచ్చిన 'లవ్ టుడే' అలాంటి సినిమానే. కాబట్టే, ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా వందకోట్లు దాటి దూసుకెళుతోంది. ఇంతటికీ కారణం.. ప్రదీప్ రంగనాథన్. తెరవెనుక దర్శకుడిగా యువత నాడిని సరిగ్గా పట్టుకోగలగడమే కాదు.. తెరపైన హీరోగానూ నేటి తరానికి ప్రతిబింబంలా అలరించాడతను. ఆ కుర్రాడి ఉద్విగ్నభరిత ప్రయాణం ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు