ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి' - valmiki jayanthi celebrations in ap

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో పోటీ పడేలా ముందుకు వెళ్లాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్​ నారాయణ అన్నారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాల్మీకి జయంతి కార్యక్రమంలో ఆయనతో పాటు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వాల్మీకులను ఎస్టీలో చేర్చేందుకు తమ వంతు కృషి చేస్తామని అమాత్యులు హామీ ఇచ్చారు.

వాల్మీకి జయంతి

By

Published : Oct 13, 2019, 8:10 PM IST

'వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి'

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని... ఇందుకోసం తాము కృషి చేస్తామని మంత్రులు గుమ్మనూరు జయరాం, శంకరనారాయణలు స్పష్టం చేశారు. అనంతపురం ఆర్ట్స్​ కళాశాల మైదానంలో జరిగిన వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి అమాత్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. వాల్మీకి జయంతిని కర్ణాటకలో ఎప్పటినుంచో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని.. సీఎం చొరవతో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇలా నిర్వహించడం ఆనందంగా ఉందని కార్మిక శాఖ మంత్రి జయరాం అన్నారు. ఇటీవల సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 80 శాతం బీసీలు ఉండడం గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు పోటీ పడేలా ముందుకు వెళ్లాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్​నారాయణ అన్నారు. ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా చేయూతనందిస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details