ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏపీ ప్రజలు భాజపా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు'

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల్లో భాజపా- జనసేన కూటమి అభ్యర్థి గెలుపొంది తీరుతారని జోస్యం చెప్పారు.

bjp leader satya kumar
bjp leader satya kumar

By

Published : Nov 29, 2020, 3:16 PM IST

రాష్ట్ర ప్రజలు భాజపా నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అనంతపురంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రసంగం

వైకాపా తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తోందని దుయ్యబట్టారు. తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల్లో భాజపా- జనసేన కూటమి అభ్యర్థి విజయకేతనం ఎగురవేస్తారని సత్యకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో భాజపా బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details