ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'5 కోట్ల జనాభాకు మూడు రాజధానులు అవసరమా ?' - రాజధానిపై కాలువ విమర్శలు

20 కోట్ల జనభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్​కు ఒకే రాజధాని ఉంటే.. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమా ? అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రకటనను వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తుంటే జగన్ స్పందించకపోవటం దుర్మార్గమన్నారు.

మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు
మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు

By

Published : Jan 16, 2020, 8:03 PM IST

రాష్ట్రంలో రాజధాని గందరగోళానికి ముఖ్యమంత్రి తెరదించకపోవటం దారుణమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటనను వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు సహా ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తుంటే జగన్ స్పందించకపోవటం దుర్మార్గమన్నారు. 20 కోట్ల జనభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్​కు ఒకేఒక్క రాజధాని ఉంటే.. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమా ? అని ప్రశ్నించారు. జగన్ చర్యను దేశంలో ఉన్న మేధావులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

ABOUT THE AUTHOR

...view details