ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు పాఠ్యప్రణాళిక' - కియా పరిశ్రమను మంత్రులు పరిశీలన వార్తలు

అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ పరిశీలించారు. వివిధ పరిశ్రమల్లో అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలలకు పాఠ్య ప్రణాళిక రూపొందించేందుకు కియా పరిశ్రమకు వచ్చినట్లు బుగ్గన వెల్లడించారు.

ap ministers visits kia plant in penugonda
ap ministers visits kia plant in penugonda

By

Published : Aug 6, 2020, 10:04 PM IST

పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలల్లో పాఠ్యప్రణాళికను రూపొందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. పెనుగొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ పరిశ్రమ, కియా శిక్షణ కేంద్రాన్ని రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఏపీఎస్​డీసీ ఎండి ఆర్జా శ్రీకాంత్​లతో కలిసి ఆయన పరిశీలించారు. శిక్షణ అందించే విధానాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులకు కియా పరిశ్రమ ప్రతినిధులు వివరించారు.

వివిధ పరిశ్రమల్లో అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను పరిశీలించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలల్లో పాఠ్య ప్రణాళిక రూపొందించేందుకు కియా పరిశ్రమకు వచ్చినట్లు వెల్లడించారు. కియాలో కార్ల తయారీకి సంబంధించి నెల, 3 నెలల కోర్సులను రూపొందించేందుకు అవకాశాలను పరిశీలించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details