సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని, కార్మికులను వెంటనే ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో పనులు లేక అప్పుల పాలై, కుటుంబాన్ని పోషించలేక గోవుల రంగయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న లోకేశ్.... వైకాపా పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు. కరోనా దెబ్బకి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ట్వీట్ చేశారు.
చేనేత కార్మికులకు శాపంగా వైకాపా పాలన: నారా లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో గోవుల రంగయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
nara lokesh