వైకాపా ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులకు ఇన్సూరెన్స్ అందలేదని ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు మల్లికార్జున అన్నారు. అనంతపురంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సంఘ నాయకులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీమా ప్రీమియం చెల్లించకుంటే ఉద్యమిస్తాం: ఏపీ రైతు సంఘం - అనంతపురం జిల్లా వార్తలు
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ తరఫున ఇన్సూరెన్స్ అందడంలేదని ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు మల్లికార్జున అన్నారు. అనంతపురం జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పంటలు పండక రైతులు తీవ్ర దుఖఃలో ఉంటే కేవలం ఇప్పటివరకు ఇన్సూరెన్స్ మంజూరు చేయలేదని ఆయన మండిపడ్డారు. రైతులకు వెంటనే ప్రీమియం చెల్లించాలని..లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. వ్యవసాయ అధికారులు కేవలం నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ చేయడం దారుణమన్నారు మల్లికార్జున. ఇప్పటివరకు 10 లక్షల మంది రైతులు బీమాకు దరఖాస్తు చేసుకున్నారన్నారని.. వారందరికి తక్షణమే ఇన్సూరెన్స్ మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు సరైన న్యాయం అందడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు...ఇద్దరు అరెస్ట్