ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CM JAGAN TOUR: సీఎం జగన్ పర్యటనలో బయటపడ్డ విభేదాలు.. కీలక నేత కంటతడి

Shinganamala YCP leader suffering video: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా నార్పల పర్యటన.. వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న చామలూరు రాజగోపాల్.. తనను తన సొంత పార్టీ నాయకులే తొక్కేస్తున్నారని కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారని ఆవేదన చెందారు.

YCP leader suffering
YCP leader suffering

By

Published : Apr 27, 2023, 3:27 PM IST

Shinganamala YCP leader suffering video: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీలో అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. పార్టీలో కీలకంగా ఉన్నటువంటి చామలూరు రాజగోపాల్.. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివరెడ్డి తీరుపై కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశమివ్వాలని కొన్ని రోజులుగా సాంబశివరెడ్డిని వేడుకుంటున్నా కూడా తనను ఏమాత్రం పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమైయ్యారు. గత్యంతరం లేక వేరే మార్గంలో సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్తుంటే పోలీసుల ద్వారా తనను అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శింగనమలలో బహిర్గతమైన వైసీపీ విభేదాలు..కంటతడి పెట్టుకున్న కీలక నేత

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు అనంతపురం జిల్లా నార్పలలో 'జగనన్న వసతి దీవెన' పథకం కింద 9 లక్షల 55వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 913 కోట్లు జమ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్.. తన పర్యటనను ముగించుకొని శింగనమల నియోజకవర్గం మీదుగా శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు. ఈ క్రమంలో శింగనమల నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి చామలూరు రాజగోపాల్.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త (ప్రభుత్వ సలహాదారు) సాంబశివరెడ్డి తీరుపై కంటతడి పెట్టుకున్నారు.

సీఎం జగన్.. నార్పలకు విచ్చేసున్న నేపథ్యంలో తనను ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని గతకొన్ని రోజులుగా సాంబశివరెడ్డిని వేడుకున్నానని.. ఓ వీడియో ద్వారా రాజగోపాల్ పేర్కొన్నారు. అయితే, ఆయన మాత్రం నిర్లక్ష్యం చేస్తూ వచ్చారన్నారు. ఈ క్రమంలో తాను వేరే మార్గంలో సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో పోలీసుల ద్వారా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న శింగనమలలో తాను సాంబశివరెడ్డికి అడ్డు వస్తానన్న కారణంతో మొదటి నుంచి తనను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఒక బీసీ కులానికి చెందిన మహిళ అని, ఆమెకు నాటక అకాడమీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చినప్పటికీ.. తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తొక్కేస్తున్నారని ఆరోపించారు.

రాజగోపాల్ మాట్లాడుతూ.. ''సాంబశివరెడ్డికి శింగనమల నియోజకవర్గంలోని ఎస్సీ సామాజిక వర్గం వారు వ్యతిరేకమైనప్పటికీ.. నేను వారిని ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ ఆయనకు అండగా నిలిచాను. అది ఆయన గుర్తించకుండా నన్ను పదే పదే వేధిస్తున్నారు. సాంబశివరెడ్డి 2010లో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ, నేను 2008 నుంచే రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పటికీ సీఎం జగన్‌కు విధేయుడుగా పని చేస్తాను. కానీ, సాంబశివరెడ్డి తీరు వల్ల ఎస్సీ సామాజికవర్గం ప్రజలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంది'' అని ఆయన వీడియోలో వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details