అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు బుధవారం సాయంత్రం భారీగా కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని బాలాజీ థియేటర్ సమీపంలో ముత్యాలు అనే నిందితుడు అక్రమంగా మద్యాన్ని దాచాడన్న పక్కా సమాచారంతో ఎస్సై రమేష్ రెడ్డి వారి బృందంతో దాడులు చేశారు. అతని నుంచి 17 బాక్సుల్లో ఉన్న 1632.. 90ఎంఎల్ కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా, రవాణా చేసినా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రవీణ్, రవిలను సీఐ అభినందించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం స్వాధీనం - anathapuram district news
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం పోలీసులుకు పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన కర్ణాటక మద్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
liquor_seez