ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం - అనంతపురం జిల్లా  ఉరవకొండ మండలం.

పై అధికారుల వేధింపులు తాళలేక ఓ ఉద్యోగిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.

అధికారుల వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

By

Published : May 3, 2019, 6:10 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ తపాలా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్న సరిత గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో విధుల్లో ఉన్న సమయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. ఓ సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు పంపింది. దీనిని గమనించిన వారు తపాలా కార్యాలయానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రెండు సంవత్సరాల నుండి పై అధికారులు ఇలా వేధింపులకు గురిచేస్తున్నారని బాధితురాలి బంధువులు తెలిపారు.

అధికారుల వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details