అనంతపురం జిల్లా కదిరిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని అడపాల వీధిలో నివాసాల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు దాటికి ఒక్కసారిగా మంటలు వ్యాపించి చెట్టు దగ్ధమైంది. ఎగిసిపడుతున్న మంటలను చూసి పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కొబ్బరి చెట్టు దగ్ధం మినహా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కదిరిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం..కొబ్బరి చెట్టుపై పిడుగు - ap latest news
కదిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అడపాల వీధిలో నివాసాల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. కొబ్బరిచెట్టుపై ఎగసిపడ్డ మంటలను చూసి పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
rain