వేరుశెనగ విత్తనాల కోసం అనంతపురం జిల్లా రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఓబులదేవర చెరువు మండల కేంద్రానికి వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున అర్ధరాత్రేతరలివచ్చారు. దుప్పట్లు తీసుకొని వెళ్లి అక్కడే పడుకున్నారు. రాత్రంతా క్యూ లైన్‌లోనే జాగారం చేస్తూ నిరీక్షించారు. ఉదయం ఏడు గంటల సమయానికే భారీ లైన్లు కనిపించాయి. విత్తన స్టాకు చాలా తక్కువగా ఉండటంతో రైతులు నిరాశతో ఉన్నారు. రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటం విత్తనాల నిల్వ తక్కువగా ఉండటంతో తమ వరకు విత్తనం వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా విత్తనం కోసం ఎదురు చూస్తున్న అధికారులు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే విత్తనం సాగు చేసుకోవడం ఎలా అంటూ ఆందోళనకు గురవుతున్నారు...
విత్తనాల కోసం రాత్రంతా జాగారం... - విత్తనాల కోసం రైతుల పడిగాపులు
వేరుశెనగ విత్తనాల కోసం అనంతపురం జిల్లా రైతులు అర్ధరాత్రి నుంచి క్యూలోనే పడిగాపులు కాస్తున్నారు. దుప్పట్లు తీసుకొని వెళ్లి మరీ పంపిణీ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారు. రాత్రంతా అక్కడే జాగారం చేశారు.
![విత్తనాల కోసం రాత్రంతా జాగారం...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3675519-587-3675519-1561608031648.jpg)
విత్తనాల కోసం రైతుల పడిగాపులు
విత్తనాల కోసం రాత్రంతా జాగారం...
Last Updated : Jun 27, 2019, 12:22 PM IST