ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రచారంలో జోరు పెంచిన బాలయ్య - election campaign

హిందూపురంలో తెదేపా ప్రచారం జోరు అందుకుంది. రోడ్​షోలతో బాలకృష్ణ ప్రజలకు చేరువవుతున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్​ గుర్తుకి ఓటు వేయాలని కోరుతున్నారు.

రోడ్​షోలో బాలకృష్ణ

By

Published : Mar 26, 2019, 11:31 PM IST

హిందూపురంలో బాలయ్య రోడ్​షో
సినీ నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురంలో రోడ్ షో నిర్వహించారు. అనంతపురం ఎంపీ నిమ్మల కిష్టప్పతో కలిసి స్థానిక చిన్న మార్కెట్ నుంచి కోటవీధి, అంబేద్కర్ నగర్, సుగురుకోట వీధి, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. తెదేపా సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీకి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. రాష్ట్రం లోటు బడ్జెట్​లో ఉన్నప్పటికీ అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పట్టణంలో అడుగడుగునా బాలయ్యకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details