ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంపై సీపీఐ నిరసన - ఏపీ తాజా వార్తలు

కరోనా వ్యాప్తి కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ నేతలు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో ఆందోళన చేపట్టారు. జిల్లాలకు నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు.

cpi
cpi

By

Published : May 10, 2021, 2:10 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ప్రజలు చనిపోతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ఆరోపించారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాన్ని నిరసిస్తూ అనంతపురం నగరంలోనే సీపీఐ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రజల ప్రాణాలతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాలకు నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం కక్ష సాధింపు చర్యలుతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యాలను చూపిస్తుంటే మీడియా పై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details