అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతంలోని నాగలమడక గ్రామంలో పెన్నానది పక్కన అంత్య సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. ఏడు పడగల సర్పాకారంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ప్రతిఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఆలయ అధికారులు.. కరోనా నేపథ్యంలో రథోత్సవ కార్యక్రమానికి భక్తులు రాకుండా నిషేధించారు. కానీ స్వామివారి దర్శనానికి, ప్రత్యేక పూజలు నిర్వహించుకొనేందుకు భక్తులకు అనుమతించారు.
ఘనంగా అంత్య సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవం - Antya Subramanya Swamy temple
అనంతపురం జిల్లా సరిహద్దు కర్ణాటకలోని నాగలమడక గ్రామంలో అంత్య సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి రెండు రాష్ట్రాల ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా అంత్య సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మోత్సవం