"మా ఊరికి ఎవరూ రావొద్దు.. ఊరి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దు" అంటూ అనంతపురం జిల్లా అరకటివేముల గ్రామంలో డప్పు చాటింపు (టముకు) వేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంపై.. అక్కడి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అధికారుల కంటే ముందే స్పందించిన గ్రామస్తులు.. ఈ మేరకు ఆంక్షలను విధించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని.. అందరికీ సూచించారు. మరోవైపు.. కరోనా సోకిన వ్యక్తి కాంటాక్ట్స్‌ను పోలీసులు గుర్తించారు. అందరినీ క్వారంటైన్‌కు పంపించారు.