.
అనంతపురంలో అన్నవరం సత్యనారాయణ స్వామి..! - Annavaram Satyanarayana Swamy temple in Anantapur
అనంతపురంలో అన్నవరం అనే సిద్ధాంతంతో నగరంలోని ఆశోక్ నగర్లో శ్రీసత్యనారాయణస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కుంభలగ్నంలో ఈ నెల 31వ తేదీన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మైసూర్ దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో బాలస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి రోజు సత్యనారాయణ వ్రతం నిర్వహించడం అక్కడి విశేషం. ఫిబ్రవరి 1వ తేదీన దాదాపు 1000 జంటలతో సత్యదేవుని వ్రతం ఉచితంగా ఆలయ ఖర్చులతో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
అనంతపురంలో అన్నవరం సత్యనారాయణ స్వామి