విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతి - 4 dogs
గాలివానకు ఉరవకొండ సమీపంలోని పొలాల వద్ద 33 కె.వి లైన్ తీగలు కింద పడి మూడు గేదెలు, నాలుగు శునకాలు మరణించాయి. గేదెలు మృతి చెందటంతో జీవనాధారం కోల్పోయామని యజమానులు వాపోతున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో కరెంట్ తీగలు తగిలి మూడు గేదెలు, నాలుగు శునకాలు మృతి చెందాయి. ఉరవకొండ నుండి కనేకల్లు మండలాలకు సరఫరా అయ్యే 33 కెవి లైన్.... గాలివానకు కింద పడడంతో అటుగా వచ్చిన గేదెలకు తీగలు తగిలి మృతి చెందాయి. వాటిని దగ్గరకు వచ్చిన నాలుగు శునకాలు కూడా ఆ విద్యుత్ వైరు తగిలి మృతి చెందాయి. నిన్న మేత కోసం పొలాల్లోకి వెళ్లగా ఈ ప్రమాదం జరిగిందని, వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రేణుమాకులపల్లి గ్రామానికి చెందిన గేదెల యజమానులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. విద్యుత్ శాఖ వారి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.