Anganwadi Workers Movement in AP :తమ డిమాండ్లు నెరవేర్చేవరకు పోరు ఆగదని, కనీస వేతనం సాధించే వరకు నిరసనలు హోరెత్తుతూనే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె ఏడో రోజు కొనసాగుతుంది. వేతనాలు పెంపు, గ్రాట్యుటీ, పింఛను అమలు తదితర డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతూ రాయలసీమ వ్యాప్తంగా వివిధ రూపాల్లో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ హామీలను గాలికి వదిలేసిన జగన్ ప్రభుత్వం - కొనసాగుతున్న ఆందోళన అంగన్వాడీ కార్యకర్తలు, కేంద్రాలపై ప్రభుత్వం మొండి వైఖరి
Anganwadi Workers Movement in Nadyala District :కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో అంగన్వాడీలు, వర్కర్లు బొమ్మల సత్రం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జగన్ మామయ్య! ఇచ్చిన మాట ప్రకారం మా అమ్మలకు జీతాలు పెంచండి- ఆరో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
Anganwadi Workers Movement in YSR District :వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలుల వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. వేంపల్లి తహశీల్దార్ కార్యాలం వద్ద అంగన్వాడీలు, వర్కర్లు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. కమలాపురం మార్కెట్ యార్డు నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూసీ,ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బైఠాయించారు.
Anganwadi Workers in Kurnool : కర్నూలు ఎస్టీబీసీ కళాశాల నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ బలవంతంగా అంగన్వాడీలు కేంద్రాల తలుపులు బద్దలు కొట్టిస్తున్నారని గుర్తు చేశారు. తమ డిమాండ్లు సాధించేవరకు దీక్ష విరమించబోమని స్పష్టం చేశారు.
Anganwadi Workers in Anantapur District :సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని అంగన్వాడీ వర్కర్లు ఆరోపించారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు శిబిరం నుంచి ర్యాలీ నిర్వహించి, ప్రధాన రహదారిపై మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చిన జగన్, తమ కుటుంబాలతో ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత దారుణంగా మోసం చేశారని పేర్కొన్నారు.
Anganwadi Workers in Singanamala :తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తగ్గేది లేదంటూ తమ నిరసనను వ్యక్తం చేసిన ఒక అంగన్వాడీలు కార్యకర్త సింగనమల మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మెలో భాగంగా ఏడవ రోజు చెవిలో పువ్వు పెట్టుకుని మోకాళ్లపై కూర్చుని భగభగ మండే సూర్యుని వల్లే అంగన్వాడీల వేదన ఉన్నాయి అంటూ తమ నిరసన వ్యక్తం చేశారు.
Anganwadi Workers Kaylanadurgam :తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కొరకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అంగన్వాడీ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విచారణ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ముందు తమ నిరసన శిబిరం నుంచి అంగన్వాడి ఉద్యోగులు బయలుదేరి ప్రధాన వీధుల్లో వాహనదారులు, పాదచారులు, వ్యాపార సముదాయాల్లోనూ కొంగు చాచి బిచ్చటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమగోడు పట్టించుకునే నాధుడు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడంపై ఆగ్రహం - పోలీసులు, సచివాలయ సిబ్బందిపై మండిపడుతున్న యజమానులు
Anganwadi Workers in Annamayya District :అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఐదు మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా చేశారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. ఏడు రోజులుగా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం అని వాపోయారు. అనంతరం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆర్డీవో మురళికి సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు
ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి - లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తాం: అంగన్వాడీ కార్యకర్తలు
Anganwadi Workers in Tirupati :తమకిచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనను ఉద్ధృతం చేశారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జీతాలు పెంచాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా చెల్లిస్తామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ సహయకులను ప్రధాన కార్యకర్తలుగా గుర్తించాలన్నారు. వారం రోజులుగా నిరసన కొనసాగిస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.