తమపై గ్రామ సచివాలయ ఉద్యోగులు, పోలీసులు వేధింపులు ఆపాలంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని ఆంగన్వాడీలు వేడుకుంటున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. అవమానకరంగా మాట్లాడి తమను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.
తమ శాఖల అధికారులు కూడా విధుల నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. వారిపై వెంటనే చర్యలు తీసుకుని అంగన్వాడీ మహిళలకు రక్షణ కల్పించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్రాయుడును కోరారు.