తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థిని సత్తా చాటింది. ఉరవకొండ మండలం వ్యాసపురానికి చెందిన ఆశ్రిత... 991 మార్కులతో ద్వితీయస్థానం కైవసం చేసుకుంది. రైతు గోవిందప్ప, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న జయలక్ష్మి కుమార్తె అయిన ఆశ్రిత.. ఐఏఎస్ అయి పేదల కష్టాలు తీర్చటమే లక్ష్యమని తెలిపింది. రైతుగా తన తండ్రి పడుతున్న కష్టాలు తెలుసని, వారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆంధ్రా విద్యార్థిని - తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఆంధ్రా విద్యార్థులు సత్తా
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అనంతపురం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉరవకొండకు చెందిన అశ్రిత తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ స్థానం సంపాదించగా.. అమడగూరు మండలానికి చెందిన సుస్మిత పదోస్థానం దక్కించుకుంది.
![తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆంధ్రా విద్యార్థిని Andhra students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7692497-713-7692497-1592626729261.jpg)
Andhra students