ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆంధ్రప్రదేశ్​-కర్ణాటక మధ్య కాంక్రీట్ పిల్లర్లు నిర్మించాలి' - interstate borders issue

ఆంధ్రప్రదేశ్​-కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన రికార్డుల ఆధారంగా సరిహద్దులు ఏర్పాటు చేయాలని బళ్లారి మైనింగ్ యజమాని... సర్వే ఆఫ్ ఇండియా అధికారులను కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

andhraparadesh- karnataka border issue
ఆంధ్రప్రదేశ్​-కర్ణాటక సరిహద్దులు గుర్తిస్తున్న అధికారులు

By

Published : Oct 24, 2020, 10:02 AM IST

ఏపీ​-కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై బళ్లారికి చెందిన మైనింగ్ యజమాని తపాల గణేశ్ స్పందించారు. కాంక్రీట్ పిల్లర్లతో సరిహద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాత రికార్డులు, చిత్రపటాల ఆధారంగా హద్దులు నిర్ణయించాలని సర్వే ఆఫ్ ఇండియా అధికారులను కోరారు. వారి వద్ద ఉన్న చిత్రపటాలనే ఆసరాగా చేసుకుని ప్రస్తుతం సర్వే చేశారని పేర్కొన్నారు.

బ్రిటీష్​ కాలంలో రాక్​ ద్వారా సరిహద్దులు ఏర్పాటు చేశారన్నారు. రికార్డుల్లో సరిహద్దుల దూరం, గుర్తులు స్పష్టంగా ఉన్నాయన్నారు. దీని ద్వారా ఖనిజ సంపద ఏ ప్రాంతంలో విధ్వంసం చేశారన్నది గుర్తించవచ్చని తెలిపారు. సరిహద్దులను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా... అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా స్పందించి వివాదాస్పదంగా మారిన హద్దులను పునరుద్ధరించాలని సర్వే ఆఫ్ ఇండియా అధికారులను కోరారు.

ఇదీ చదవండి: పదేళ్ల సరిహద్దు వివాదం.. తీరిపోయే సమయం!

ABOUT THE AUTHOR

...view details