ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులందరికీ వెంటనే బీమా చెల్లించాలి.. లేకుంటే..

పంట నష్టపోయన రైతులందరికీ వెంటనే బీమా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెయ్యి రూపాయలు కూడా పరిహారం అందని రైతులు చాలా మంది ఉన్నారన్నారు. తక్షణమే ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి, పంట నష్టపోయిన రైతుల జాబితా తయారు చేయాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు

By

Published : Jun 18, 2022, 3:43 PM IST

అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు ఆందోళన నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులందరకీ వెంటనే బీమా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వెయ్యి రూపాయలు కూడా పరిహారం అందని రైతులు చాలా మంది ఉన్నారని.. ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోందన్నారు. పంట నష్ట పరిహార జాబితా తయారు చేయటంలో అనేక అవకతవతలు జరిగాయని.. ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి, పంట నష్టపోయిన రైతుల జాబితా తయారు చేయాలని రైతు సంఘం నేత చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ దోరణి మార్చుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని.. సచివాలయాలకు తాళం వేయటానికి సైతం వెనకాడమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details