Congress plans State wide padayatra : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్న తీరుపై ప్రజల్లో అవగాహన తెచ్చెందుకే రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారనీ.. ఆయన స్పూర్తితో డిసెంబర్లో తానూ పాదయాత్ర నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ చెప్పారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
PCC president: త్వరలో పాదయాత్ర చేపడతాను: పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ - ఇందిరాగాంధీ జయంతి
PCC president Sailajnath రాహుల్ గాంధీ స్పూర్తితో త్వరలో తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ తెలిపారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ, వైసీపీలు కులాలు, మతాలమధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చాయని ఆరోపించారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో భాజపా నేతలు బ్రిటీష్ పాలకుల కాళ్లు మొక్కటం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్వహించే పాదయాత్రలో యువత, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో తాను చర్చకు సిద్ధమని, ఎక్కడికి చర్చకు ఆహ్వానించినా వస్తామని శైలజనాథ్ సవాల్ చేశారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. అనంతపురం జిల్లా మొదలు, అమరావతి వరకు ఏ భవనం చూసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినవేనని శైలజనాథ్ వెల్లడించారు. ఈ ప్రభుత్వం ఒక్క భవనమైనా నిర్మించిందా.. అంటూ శైలజనాథ్ ప్రశ్నించారు.
ఇవీ తదవండి: