అనంతపురం జిల్లా యాడికి మండలం ఉప్పలపాడుకు చెందిన దంపతులు...తామూ ఎస్సీలమే అంటూ ఆర్డీఓ గుణభూషన్ రెడ్డి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. దీనిపై ఈనాడు-ఈటీవీ, ఈటీవీ భారత్లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు బాధితులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విషయంపై విచారణ చేపట్టడం సహా బాధితులకు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించినట్లు... కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబు వెల్లడించారు.
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మీ సమస్య తీరుస్తాం...భయపడొద్దు' - అనంతపురంలో కథనాలపై కలెక్టర్ వార్తలు
'మేమూ ఎస్సీలమే' అంటూ... ఈనాడు-ఈటీవీ, ఈటీవీ భారత్లో ప్రసారం చేసిన కథనానికి అనంతపురం జిల్లా అధికారులు స్పందించారు. బాధితుల సమస్యను తీరుస్తామని భరోసా ఇచ్చిన అధికారులు...రూ. 2లక్షల పరిహారం ప్రకటించారు.
![ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మీ సమస్య తీరుస్తాం...భయపడొద్దు' ananthapuram district officers helps to victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7438901-612-7438901-1591052220489.jpg)
అనంతపురం జిల్లా అధికారులకు సమస్యను వివరిస్తోన్న బాధితులు
అనంతపురం జిల్లా అధికారులకు సమస్యను వివరిస్తోన్న బాధితులు
బాధిత కుటుంబానికి కుల ధ్రువీకరణ పత్రం ఒక్కోసారి ఒక్కోలా ఎలా ఇచ్చారంటూ... తహసీల్దారుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ భయపడొద్దంటూ బాధితులకు భరోసా ఇచ్చిన కలెక్టర్.... రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.
ఇదీ చూడండి: వివాహేతర సంబంధం: రెండు హత్యలూ.. ఒక ట్విస్ట్