పాఠశాల విద్యా బోధనలో సాంకేతికతతో పాటు డిజిటలైజేషన్‌లో విశిష్ట ప్రతిభ చూపిస్తున్న ఉపాధ్యాయులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాతీయ పురస్కారాలతో సత్కరించింది. 2017 సంవత్సరానికి గానూ ఈ ఐసీటీ అవార్డు అనంతపురం జిల్లా కదిరి పాఠశాలకు చెందిన వజ్ర నర్సింహారెడ్డికి దక్కింది. దిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సంజయ్ దోత్రే చేతుల మీదుగా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.
సాంకేతికతలో విశేష ప్రతిభ.. ఉపాధ్యాయునికి ఐసీటీ అవార్డు - ananthapuram teacher got ict awards news
డిజిటిలైజేషన్లో విశేష ప్రతిభ చూపిస్తోన్న ఉపాధ్యాయులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జాతీయ పురస్కారాలతో సత్కరించింది. దేశంలో మొత్తం 43 మంది అవార్డులకు ఎంపిక కాగా.. అందులో ఏపీ నుంచి ఒక్కరు, తెలంగాణ నుంచి ఇద్దరుఉన్నారు. అనంతపురం జిల్లా కదిరి పాఠశాలకు చెందిన వజ్ర నరసింహారెడ్డికి 2017కు గానూ ఐసీటీ అవార్డు దక్కింది.
సాంకేతికతలో విశేష ప్రతిభ.. ఉపాధ్యాయునికి ఐసీటీ అవార్డు