ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ANANTHA FARMERS: అనంత పంటలు వర్షార్పణం.. ఆదుకోవాలంటూ అన్నదాతల ఆందోళన! - ap latest news

RAINS EFFECT IN ANTHAPURAM: కొన్ని నెలల ముందు వర్షాభావానికి తట్టుకున్నారు.! కష్టమైనా అప్పు చేసి విత్తు వేశారు.! ఇక......... పంట చేతికొస్తుందనుకుని సంబరపడేలోపే వరుణుడు ఆశలపై నీళ్లు చల్లాడు.! అనంత జిల్లాలో...ముందెన్నడూలేని వర్ష బీభత్సానికి.. నిండా మునిగామంటూ..రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు..

anathapuram-farmers-lossed-huge-crop-due-to-heavy-rains
అనంత పంటలు వర్షార్పణం.. ఆదుకోవాలంటూ అన్నదాతల ఆందోళన!

By

Published : Nov 23, 2021, 9:59 AM IST

Updated : Nov 23, 2021, 11:56 AM IST

అనంత పంటలు వర్షార్పణం.. ఆదుకోవాలంటూ అన్నదాతల ఆందోళన!

ANANTHAPURAM FARMERS AFFECTED WITH RAINS: ఈసారి ఖరీఫ్ ప్రారంభం నుంచి.. అనంత అన్నదాతలపై ప్రకృతి కక్ష సాధిస్తోంది. పంట కీలకదశలో తీవ్ర వర్షాభావంతో చాలామంది రైతులు నష్టపోగా... చేతికొచ్చే సమయంలో కుంభవృష్టి వానలు పూర్తిగా తుడిచిపెట్టేశాయి. నవంబర్‌లోనే రెండుసార్లు అల్పపీడన ప్రభావంతో పంటలు వర్షార్పణం అయ్యాయి. జిల్లాలోని 59 మండలాల్లో వారం పాటు ఏకధాటి వర్షాలకు తోడు కర్ణాటకలో భారీవర్షాలతో పెన్నా, చిత్రావతి, కుశావతికి నదులకు నీరు ఉప్పొంగాయి. చాలాచోట్ల వాగులు, వంకల ఉగ్రరూపంతో పంట తుడిచిపెట్టుకుపోయింది.

3 వేలకు పైగా ఎకరాల పంట వర్షార్పణం..!

HUGE CROP LOSS AT ANANTHAPURAM: అనంతపురం జిల్లాలోని 555 గ్రామాల్లో సుమారు లక్షా 10 వేల ఎకరాల్లో 158 కోట్ల పెట్టుబడి వర్షార్పణం అయిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పప్పుశనగ 54 వేల ఎకరాల్లో నష్టపోగా.. వరి 25 వేల ఎకరాలు, వేరుశనగ 7 వేల 500, ఆముదం 6 వేల 400, మొక్కజొన్న 2 వేల 800, పత్తి 2 వేల 300, కంది రైతులకు 2 వేల 650 ఎకరాల్లో పూర్తిగా నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ఇతర పంటలన్నీ కలిపి మరో 650 ఎకరాల్లో నష్టపోయారని ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారు. సర్వం కోల్పోయామంటూ... రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదిరోజుల్లో పంట చేతికొస్తుందనేటప్పుడు వర్షం వచ్చింది. ఎంతో నష్టపోయాం. నేను అరెకరం వేశాను. దాదాపు 30 వేల దాకా ఖర్చయింది. ప్రభుత్వం మాకేమన్న సాయం చేయాలి.- రైతు, అనంతపురం జిల్లా

ఒక ఎకరం పంట మొత్తం నేలపాలైపోయింది. మా తోటి రైతుల గూడా ఇదే పరిస్థితి. ఒక నూరెకరాల దాకా సర్వం నాశనమైపోయింది. మాది సుమారు ఎకరా దాకా ఉంటుంది. 50 వేల దాకా ఖర్చు వచ్చింది. పది రోజులైతే కోసే టైంలోనే ఇట్లా అయిపోయింది.- రైతు, అనంతపురం జిల్లా

మొత్తమంతా మూడ్రోజుల నుంచి వర్షాలొచ్చి అంతా నేలమట్టమైపోయింది. అసలు తినడానికి పనికిరాకుండా అయిపోయింది. మొత్తం మొలకలొచ్చేసినాయి. ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు. - రైతు, అనంతపురం జిల్లా

పత్తివిత్తనాలకు చెట్లపైనే మొలకలు..

ANANTHA FARMERS DEMAND: చాలాచోట్ల నూర్పిడి చేసి ఆరబెట్టిన మొక్కజొన్న మొలకెత్తాయి. పత్తి విత్తనాలకు చెట్టుపైనే మొలకలొచ్చిన సందర్భాలున్నాయి. హెచ్​ఎల్సీ, చెరువుల కింద సాగుచేసిన వరి రైతులకు అధిక నష్టం జరిగింది. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:Kondapalli Municipal Chairman Election: వైకాపా కౌన్సిలర్ల వీరంగం.. ఛైర్మన్ ఎన్నిక వాయిదా...

Last Updated : Nov 23, 2021, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details