ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా ఉద్యోగులపై వేధింపులు..వ్యవసాయ శాఖ జేడీఏ హబీబ్ బాషా అరెస్ట్ - అనంతపురం వ్యవసాయ శాఖ జేడీఏ హబీబ్ బాషా అరెస్ట్

మహిళా ఉద్యోగులను వేధిస్తున్నాడనే ఆరోపణలపై అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ హబీబ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

anathapuram district agricultural jda  habeeb basha arrest
హబీబ్ బాషా

By

Published : Aug 5, 2020, 4:00 PM IST

అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ హబీబ్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలపై అతనిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పనిచేసే ఓ మహిళా ఉద్యోగి డిప్యుటేషన్​పై వెళ్లేందుకు అభ్యర్థించగా.. వేధింపులకు గురి చేశారని ఆ మహిళ ఆరోపించారు.

అలాగే పలువురు మహిళా ఉద్యోగులు హబీబ్ బాషాపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తీసుకెళ్లారు. త్వరలో కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details