కరోనా బారిన పడి మాణిక్యాలరావు చికిత్స పొందుతూ మృతి చెందడం బాధకరమని అనంతపురం జిల్లా కదిరి భాజపా నేతలు అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మాణిక్యాలరావు మృతికి సంతాపం తెలుపుతూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ పటిష్టతకు ఆయన చేసిన కృషిని, దేవాదాయ శాఖ మంత్రిగా ఆలయాల అభివృద్ధి, ఆస్తుల సంరక్షణ కు తీసుకున్న చర్యలను గుర్తు చేసుకున్నారు.
'మాణిక్యాల రావు మృతి భాజపాకు తీరని లోటు' - మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి వార్తలు
మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి భాజపాకు తీరని లోటని... ఆ పార్టీ నేతలు అన్నారు. ఆయన మృతిచెందడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
'మాణిక్యాల రావు మృతి భాజపాకు తీరని లోటు'