ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"గ్రామాల్లో నివాసం ఉండని సచివాలయ ఉద్యోగిని తొలగిస్తాం" - అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ

గ్రామ సచివాలయ మెరిట్ జాబితాను సాయంత్రంలోపు విడుదల చేస్తామని అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు.

"గ్రామాల్లో నివాసం ఉండకపోతే తొలగిస్తాం"

By

Published : Sep 24, 2019, 2:31 PM IST

"గ్రామాల్లో నివాసం ఉండకపోతే తొలగిస్తాం"
గ్రామ సచివాలయ మెరిట్ జాబితాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితిపై అనంతపురం కలెక్టర్ సత్యనారాయణ స్పందించారు. మెరిట్ జాబితాను సాయంత్రంలోపు విడుదుల చేస్తామని అభ్యర్థులకు కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఉద్యోగ ఖాళీల కంటే పరీక్షకు హాజరైన వారి సంఖ్య తక్కువని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా గ్రామాల్లో ఉండాల్సిందేనని కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. పారదర్శకంగా నియమాకాలు జరుగుతాయనీ, అభ్యర్థులు ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా, 17 మండలాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. రబీ సాగు చేసే రైతులకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details