ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసుల నుంచి తప్పించుకునేందుకే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం' - Anantapur latest news

అనంతపురంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్​ ప్రకాశ్​పై పలు కేసులున్నట్లు డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇటువంటి చర్యకు పాల్పడ్డాడన్నారు. అధికారుల వేధింపులపై అతను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

'కేసుల నుంచి తప్పించుకునేందుకే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం'

By

Published : Nov 2, 2019, 12:18 PM IST

'కేసుల నుంచి తప్పించుకునేందుకే కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం'

అనంతపురంలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ప్రకాశ్​పై పలు కేసులు ఉన్న కారణంగానే... వాటి నుంచి తప్పించుకోవాలని భావించినందునే ఇలాంటి చర్యకు దిగాడని డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి.. 20 ఏళ్లుగా ఏఆర్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక.. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని డీఎస్పీ తెలిపారు. అనంతపురం ఏఆర్ విభాగం రిజర్వ్ ఇన్​స్పెక్టర్ శేఖర్ ఇంట్లో పేలుడు పదార్థాలు ఉంచి హత్యాయత్నం చేయడం, ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేసేందుకు యత్నించడం, పలువురిపై దాడి, బెదిరింపులకు దిగడం, ఒక మహిళను మోసం చేసిన కేసులు ఆయనపై ఉన్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో ఇబ్బందులు ఉన్నాయని సంబంధిత అధికారులను ఎప్పుడూ కలవలేదన్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటి నుంచి తప్పుంచుకునేందుకే ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పారు. కానిస్టేబుల్ ప్రకాశ్ ఆరోపిస్తున్నట్లుగా ఏ అధికారి వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details