ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"కృష్ణా జలాల కోసం పోరాడుదాం" - "కృష్ణా జలాలకై పోరాడుదాం"

సాగు, తాగు నీరు లేక వలస పోతున్న అనంతపురం రైతులు ఆపేందుకు మడకశిరలో కృష్ణా జల సాధన సమితి సదస్సు ఏర్పాటు చేశారు.

"కృష్ణా జలాలకై పోరాడుదాం"

By

Published : Sep 4, 2019, 11:29 AM IST

Updated : Sep 4, 2019, 11:35 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో రైతన్నల వలసలు ఆపేందుకు కృష్ణా జల సాధన సమితి రైతులతో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్సీ, కృష్ణ జల సాధన సమితి కన్వీనర్ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ, జిల్లాలో వలసలు ఆగాలన్న, రైతు మరణాలు తగ్గాలన్న మడకశిరకు కృష్ణ జలాలు ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలోనే ఎత్తైన ఈ ప్రాంతంలో వర్షాలు పడక రైతులు ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారని చెప్పారు. కొంత మంది రైతులు వేసిన పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి బోర్లు వేసినా నీరు పడకపోవటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. మడకశిరకు నీటి సమస్యను పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై హంద్రినీవా కాలువ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యాక్రమానికి పెద్ద ఎత్తున వివిధ పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు.

"కృష్ణా జలాలకై పోరాడుదాం"
Last Updated : Sep 4, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details