ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ananthapuram: గొల్లపల్లిలో రెండు బైక్​లు ఢీ.. ఇద్దరు మృతి - ప్రమాదం

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అనంతపురం జిల్లా పరిగిలో ఈ ఘటన జరిగింది.

Accident
రోడ్డు ప్రమాదం

By

Published : Jul 14, 2021, 1:38 PM IST

అనంతపురం జిల్లా పరిగి మండలం గొల్లపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గొల్లపల్లి గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గంగిరెడ్డి ( 37) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి హరీష్ (31)ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించగా చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details