ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' ప్రజాభిప్రాయం తీసుకుని.. అప్పుడు మూడు రాజధానులు పెట్టండి' - అనంతపురం జిల్లా తెదేపా నేతలు

ప్రజాభిప్రాయ సేకరణతో మూడు రాజధానులపై వైకాపా ప్రభుత్వం ముందుకెళ్లాలని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వరనాయుడు అన్నారు. సీఎం జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానులంటున్నారని విమర్శించారు

ananthapuram tdp leaders about three capitals
అనంతపురం జిల్లా తెదేపా నేతలు

By

Published : Aug 4, 2020, 4:04 PM IST

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనంతపురం జిల్లా తెదేపా నేతలు అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో ఈ నిర్ణయంపై ముందుకెళ్లాలని కల్యాణదుర్గం తెదేపా ఇన్​ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు సూచించారు. మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ దొడగట్ట నారాయణ మాట్లాడుతూ.. సీఎం జగన్ స్వార్థ ప్రయోజనాల కోసం మూడు రాజధానులంటున్నారని విమర్శించారు. ఆ ఉద్దేశం లేకపోతే చంద్రబాబునాయుడు విసిరిన సవాల్​ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details