ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణంపై విశ్లేషణ.. జెనీలియాకు అవార్డ్ - అనంతపురం విద్యార్థిని జెనీలియా లీసా వార్తలు

తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారికి ఆసక్తి ఉంటే విద్యార్థులు ఎలాంటి అంశాలలోనైనా ప్రతిభ చూపుతారనేదానికి అనంతపురం విద్యార్థిని జెనీలియా లీసా నిదర్శనం. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జెనీలియా.. ప్రపంచ వేదికపై సత్తా చాటింది. పర్యావరణ పరిరక్షణపై 'చెట్టును హత్తుకుందాం' అనే అంశంపై తను ఇచ్చిన వివరణ ప్రశంసలు అందుకుంది. 22 దేశాలకు చెందిన 6 వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.

ananthapuram student jenelia lisa received award in taana competetions
పర్యావరణంపై విశ్లేషణ.. జెనీలియాకు అవార్డ్

By

Published : Jun 11, 2020, 4:58 PM IST

Updated : Jun 11, 2020, 5:37 PM IST

అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ప్రొఫెసర్ ఆనంద్, సుస్మితల కుమార్తె జెనీలియా లీసా.. ఏడో తరగతి చదువుతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5, 6, 7 తేదీల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), జిజ్ఞాస ఫౌండేషన్ సంయుక్తంగా యుఎన్ఓ సహకారంతో నిర్వహించిన పోటీల్లో లీసా సత్తా చాటింది.

ఈ పోటీలను జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఇందులో జెనీలియా లీసా 'చెట్టును హత్తుకుందాం' అనే విషయంపై విశ్లేషణ చేసింది. న్యాయనిర్ణేతలను మెప్పించి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రోత్సాహం, ఆసక్తి ఉంటే పిల్లలు తమకిష్టమైన అంశాలలో ప్రతిభ చూపగలరని జెనీలియా నిరూపించింది.

Last Updated : Jun 11, 2020, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details