ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్కా రాయుళ్లకు సహాయం చేశారు... అడ్డంగా బుక్కయ్యారు... - అనంతపురం జిల్లా నేర వార్తలు

మట్కా రాయుళ్లకు సహాయం చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లకు అనంతపురం జిల్లా ఎస్పీ షాకిచ్చారు. మట్కాను ప్రోత్సహిస్తూ మాముళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో వీరిపై చర్యలకు ఉపక్రమించారు. ముగ్గురిని వీఆర్​కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

అవినీతికి పాల్పడిన ముగ్గురు కానిస్టేబుళ్లను విఆర్​కు పంపిన ఎస్పీ
అవినీతికి పాల్పడిన ముగ్గురు కానిస్టేబుళ్లను విఆర్​కు పంపిన ఎస్పీ

By

Published : Aug 23, 2021, 10:42 PM IST

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అవినీతికు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుళ్ల బాగోతాన్నిపోలీసులు రట్టు చేశారు. మట్కా రాయుళ్లకు సహాయ పడుతూ అందిన కాడికి డబ్బులు వసూలు చేస్తుండడంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. గుత్తి పట్టణానికి చెందిన పలువురు మట్కా రాయుళ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వారి వ్యాపార లావాదేవీలకు సహాయపడినట్లు ఆరోపణలు రావడంతో ఫిరోజ్, డాన్ శీను, మహేశ్ పై ఎస్పీ సీరియస్​ అయినట్లు తెలిసింది. ఆ ముగ్గురు కానిస్టేబుళ్లను వీఆర్​కు పంపుతున్నట్లు జిల్లా ఎస్పీ పకీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details