లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేందుకు పోలీసులు ప్రతి అవకాశాన్ని వినియోగిస్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి తీరుపై కఠినంగా స్పందిస్తున్నారు. అనంతపురం జిల్లా తలుపుల ప్రాంత పోలీసులు.. అక్కడి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలతో సమావేశం అవుతున్నారు. లాక్ డౌన్ పై ప్రకటనలు చేస్తున్నారు. కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. వాహనాలు స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.
పల్లెల్లో సమావేశాలు.. ప్రజలకు హెచ్చరికలు
లాక్ డౌన్ పై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నవారికి.. పోలీసులు ప్రత్యక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. జిల్లాలోని పల్లెల్లో సమావేశాలు నిర్వహిస్తూ.. కరోనాపై అవగాహల కలిగిస్తున్నారు. ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు.
తలుపుల పోలీసుల వినూత్న ప్రచారం
ఇవీ చూడండి:
పోలీసు జీపు బోల్తా: ఎస్సై సహా ఐదుగురికి గాయాలు