ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేసింది ఎంబీఏ.. చేపట్టిన వృత్తి చోరీలు..!

ఎంబీఏ చేసిన ఓ యువకుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలనే వృత్తిగా మార్చుకున్నాడు. లారీలు దొంగిలించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి హైదరాబాద్​లో అమ్మేవాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

ananthapuram police traced
ఎంబీఏ చేసి.. జల్సాల మోజులో దొంగతనాలు..

By

Published : Jan 2, 2020, 1:19 PM IST

ఎంబీఏ చేసి.. జల్సాల మోజులో దొంగతనాలు..

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తికి చెందిన లారీ డిసెంబర్ 31న చోరీకి గురైంది. పెట్రోల్ బంకులో ఆపి ఉన్న లారీని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా లారీ తెలంగాణలోని వనపర్తిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లారీతో పాటు నిందితుడు గంగాధర్​రావును అదుపులోకి తీసుకున్నారు.

జల్సాలకు అలవాటుపడే

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన గంగాధర్​రావు ఎంబీఏ పూర్తి చేశాడు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 22 లారీలు, 6 డీసీఎం వాహనాలు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ దొంగిలించిన వాహనాల నెంబర్లు మార్చి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి... హైదరాబాద్​లో అమ్మేవాడు. కేసు నమోదైన 12 గంటల్లోనే... చేధించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇవీ చూడండి:

ధర్మవరంలో చేనేత కార్మికుడి ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details